గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
14-06-2024 01:50 AM
అత్యాచారం చేసి, హత్య చేసినట్లు అనుమానం
ఆదిలాబాద్, జూన్13 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని కురిద్‌నగర్ ప్రాంతంలో రోడ్డు పక్క న గుర్తుతెలియని మహిళ మృతదే హం గురువారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థ లాన్ని డీఎస్పీ జీవన్‌రెడ్డి పరిశీలించా రు. మృతదేహంపై గాయాలు ఉండడంతో.. అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో చంపి, ఇక్కడకు తీసుకువచ్చి పడేసిటనట్లు తెలుస్తున్నది. మృతురాలికి సుమారు 30 ఏళ్లుంటాయని డీఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు.






