రైతుల పొలాల్లో బ్యాంకు ఫ్లెక్సీలు.. ఆందోళనలో రైతులు
లింగంపేట్ : కామారెడ్డి జిల్లాలో ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. డీసీసీబీ బ్యాంకు వేలం వేస్తామంటూ రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టింది. లింగంపేట్ మండలం పొల్కంపేట్, పర్మల్ల, షట్ పల్లి, సంగారెడ్డి గ్రామాల్లోని రైతుల పోలాల్లో శుక్రవారం ఫ్లెక్సీలు వెలిశాయి. బ్యాంకు అధికారులు పొలాల్లో ఫ్లెక్సీలు, ఎరుపురంగు జెండాలను ఏర్పాటు చేశారు. రుణాలు చెల్లించినందున పొలాలు వేలం వేస్తామంటూ ఫ్లెక్సీలు పెట్టామని అధికారులు తెలిపారు. డీసీసీబీ బ్యాంకు సిబ్బంది ఫ్లెక్సీలు పెట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు. వడ్డీ రేటు తగ్గిస్తే రుణులు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైతులు చెబుతున్న, వడ్డీ రేట్లు తగ్గించే ప్రసక్తి లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






