3 August, 2026 | 4:43 AM

మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే

03-09-2025 12:00 AM
  1. భారీ బైకు ర్యాలీ మునుగోడు మాజీ ఎమ్మెల్యే 
  2. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  3.  చండూరు, సెప్టెంబర్ 02 :  కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంరైతాంగానికి సరిపడ యూరియాను అందించలేక పోవ డంతో రైతులు చాలా ఇబ్బందులు పడు తున్నారని మునుగోడుమాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసనగా నల్ల భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు..

  4. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజె క్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, రైతన్న ముఖంలో సంతోషాన్ని నింపిన కెసిఆర్ పై కాలేశ్వరం కమిషన్ విచారణ పేరిట తప్పుడు నోటీసులు పంపిస్తున్న  ప్రభుత్వంకు త్వరలోనే తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలుచెప్తారని అన్నారు.   కాలే శ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని ఈ ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు.

  5. తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నది జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.  సిబిఐకి కాలేశ్వరం అప్పజ ప్పడమంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయ డమేనని ఆయన అనుమానం వ్యక్తం చేశా రు. నిన్నటిదాకా  వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరంపై  సిబిఐకి ఇచ్చినఎఏజెన్సీకి ఇచ్చిన భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  6. బెదిరింపులు కేసులు బి ఆర్‌ఎస్ పార్టీకి కొత్త కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏన్ని పోరాటాలైన త్యాగాలైనా చేస్తామని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని  అన్నారు.  చండూరు మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, చండూర్ మున్సిపల్ మాజీచైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, కోడి  వెంకన్న,బిఆర్‌ఎస్  పార్టీ మాజీ మండల అధ్యక్షులు పెద్దగోని వెంకన్న, బొడ్డు సతీష్, పగిళ్ల సతీష్,గౌడ్,కురు పాటి సుదర్శన్, ఇర్గి గురునాథం, బిఆర్‌ఎస్ అన్ని మండలాల అధ్యక్షులు, బిఆర్ ఎస్ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు  పాల్గొన్నారు.

రాస్తారోకో, ధర్నా..

ఆలేరు, సెప్టెంబర్ 01 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బిఆర్‌ఎస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసరం కాళేశ్వరంపైన కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు నిరసనగా కాలేశ్వరం ప్రాజెక్ట్ సిబిఐ కి అప్పగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు బిఆర్‌ఎస్ ఆలేరు మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.

మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య  మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తూ సిబిఐకి అప్ప గించి కెసిఆర్ పై కేసులు పెట్టాలని చూస్తే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని దుర్మార్గమైన పాలన రేవంత్ రెడ్డి పాలన అని అన్నారు.

కాలేశ్వరంలో రెండు పిల్లర్లు మాత్రమే కృంగిపోయాయి వాటిని రిపేర్ చేయకుండా ఇబ్బంది కూడా చేస్తున్నారని అన్నారు.  బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్,  పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల పార్టీ సెక్రటరీ జనరల్ రామ్, నర్సయ్య, గుండ్లగడెం మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, మాజీ ఆర్టీఏ నెంబర్ పంతం కృష్ణ, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, జింకల రామకృష్ణ యాదవ్, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, కూతటి అంజన్ కుమార్, సముద్రాల కుమార్, సుధీర్, పాల్గొన్నారు.

సీబీఐ విచారణ నిరసిస్తూ ..

వలిగొండ,సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి చిట్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ విచారణ సరైంది కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి మొగుళ్ళు శ్రీనివాస్,  పడమటి మమత తదితరులు పాల్గొన్నారు.

  1. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి..
  2. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్  

మోతే, సెప్టెంబర్ 2:-  కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు మానుకో వాలని సిబిఐ కి ఘోశ్ కమిషన్ కు అప్పజె ప్పడంపై మోతే మండల కేంద్రంలో బిఆర్ ఎస్ మోతే మండల అధ్యక్షుడు శీలం సైదులు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించ డం జరిగింది.

రాస్తారోకోలో మాజీ ఎంపీ బి ఆర్ ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడు గుల లింగయ్య యాదవ్ పాల్గొని మాట్లాడు తూ కేసిఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిదని పంటలు సస్యశ్యామలంగా పండయాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లో కాళే శ్వరం నీళ్లు రాకుండా చేసి సాగర్ నీళ్లు రాకుండా చేసి  రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ యూరియా కూడా దొరకని దుస్థితి నెలకొన్నదని అన్నారు.

ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీలు ఇస్తామని హామీలు ఇచ్చి గెలిచి  ఒక  హామిని కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐ కి ఇవ్వడం  దుర్మార్గమైన చర్యఅని  అప్రజాస్వామిక ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వై వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, యుగంధర్ రెడ్డి, మద్ది మధుసూదన్, పగడాల వెంకటరెడ్డి,  వెంకటేష్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.