3 August, 2026 | 5:39 AM

అవసరాన్నిబట్టి సరఫరా చేయండి

03-09-2025 12:00 AM

ఎమ్మెల్యే అనిరుద్రుడితో కలిసి ఏరియాను పరిశీలించిన కలెక్టర్ విజయేందిర బోయి 

జడ్చర్ల సెప్టెంబర్ 2: జిల్లాకు వచ్చిన యూరియాను అన్ని మండలాలకు అవసరం బట్టి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,జడ్చర్ల శాసన సభ్యులు జె.అనిరుధ్ రెడ్డి తో కలిసి జడ్చర్ల రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్ కు వచ్చిన యూరియా రేక్ ను పరిశీలించారు.

మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,నారాయణ పేట జిల్లాలకు కలిపి 1500 మెట్రిక్ టన్నులు యూరియా రేక్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో మహబూబ్ నగర్ కు 550 మెట్రిక్ టన్నులు,నాగర్ కర్నూల్ కు 650 మెట్రిక్ టన్నులు,నారాయణ పేటకు 300 మెట్రిక్ టన్నుల యూరియా జడ్చర్ల రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్ కు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబ్ నగర్ కు వచ్చిన 550 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని మండలాలకు అవసరం బట్టి సరఫరా చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్,  మండల వ్యవసాయ అధికారి గోపినాథ్ తదితరులు ఉన్నారు.