13 April, 2026 | 3:41 AM

క్యాస్ట్ హిట్ కావాలి

13-04-2026 01:52 AM

ఏకే జంపన్న రచనాదర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘క్యాస్ట్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. “దర్శకుడు జంపన్న నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఈ సినిమా మంచి హిట్ సాధించి జంపన్నకు మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.