జనగణన సమర్థవంతంగా నిర్వహించాలి
22-04-2026 12:56 AM
కలెక్టర్ బాదావత్ సంతోష్
అచ్చంపేట, ఏప్రిల్ 21: ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ హైస్కూల్లో జరుగుతున్న జనగణన శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.
గతంలో కాగితంపై జనగణన వివరాలు నమోదు చేసేవారని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా 2027 జనగణన డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి కి వెళ్లే ముందు హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ఆధారంగా హద్దులను పరిశీలించుకోవాలన్నారు. మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సే వలపై ఆరా తీశారు. వారి వెంట అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.






