18-07-2025 12:15:10 AM
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేంద్రం ఎన్నటికీ నష్టం చేయదని బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. నీటి సమస్యలపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగడం మంచి దేనని అన్నారు. సెంటిమెంట్‌తో లబ్ధి పొందాలనుకోవడం సరికాదని బీఆర్‌ఎస్ పార్టీపై అరుణ మండిపడ్డా రు. తెలంగాణకు నష్టం జరగకుండా చూడాలన్నారు.
నీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగా ణ బీజేపీ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. గురువారం హైదారాబాద్‌లోని హకా భవన్‌లో ఎఫ్‌ఐసీ తెలంగాణ కన్సల్టెటివ్ తొలి సమావే శం జరిగింది. తెలంగాణలో ఎఫ్‌సీఐ పనితీరు, గోడౌన్ల నిర్వహణ, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం డీకే అ రుణ మీడియాతో మాట్లాడుతూ తె లంగాణకు నష్టం జరిగే పని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ చేయదని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదని తెలంగాణ ప్రభుత్వం చెబు తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశా రు. తెలగాణాలో ఎఫ్‌సీఐ ద్వారా సేకరించిన బియ్యన్ని 8 రాష్ట్రాలకు ఎ గుమతులు చేస్తున్నామన్నారు. తెలంగాణ కన్సల్టెటివ్ కమిటీ చైర్మెన్‌గా బా ధ్యతలు అప్పగించిన కేంద్రం ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.