18-07-2025 12:14:53 AM
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్, జులై 17 (విజయక్రాంతి): నాలాలు, వాగులు చెరువులు తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.జగిత్యాల అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ డ్రైవ్ క్లీనింగ్ శానిటేషన్ లో భాగంగా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. జగిత్యాల పట్టణం లోని ఎల్ ఎల్ గార్డెన్ వెనకాల నాలాను పరిశీలించారు.
నాలాలో మురుగునీరు సక్రమంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని నాలాపై అక్రమ కట్టడాలు ఉంటే కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.ధరూర్ క్యాంప్ రామాలయం దగ్గర మేజర్ జంక్షన్ నాలాలను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని సూచించారు.చింతకుంట చెరువులోని నీరు బయటకు వెళ్ళే నాలా, రాజీవ్ చౌరస్తా కూడలిలోని నాలా ను పరిశీలించారు.
డ్రైనేజీ లలో చెట్లు, ముళ్ళ పొదలు,వేస్టేజ్ ను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద జగిత్యాల మున్సిపాలిటీలో వ్యర్థ నివారణ, డ్రెయిన్లు, వాగులు, ప్రభుత్వ భూములను శుభ్రపరిచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, నీటిపారుదల శాఖ అధికారి ఖాన్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.