14 May, 2026 | 4:02 AM

నీట్ పరీక్ష రద్దుకు కేంద్రమే బాధ్యత వహించాలి

14-05-2026 03:06 AM

బీబీపేట్, మే 13 (విజయ క్రాంతి): నీట్ పరీక్ష రద్దుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్  2026 పరీక్ష ప్రశ్నపత్రం రాజస్తాన్ లో లీకేజీ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం, తిరిగి నిర్వహించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ల వైఫల్యమేనని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు.ఏటా జరిగే పేపర్ లీకులు, అక్రమాలతో విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల కష్టం వృధా అవుతుందన్నారు.మళ్లీ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో, కౌన్సెలింగ్ మరియు అడ్మిషన్లు ఆలస్యం కానున్నాయని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారనీ అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా కేంద్రం చొరవ చూపాలన్నారు నీట్ పరీక్ష నిర్వహణలో NTA బాధ్యతారహితంగా వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.