14 May, 2026 | 4:02 AM

బాన్సువాడ ఆర్డీవోగా రవీందర్ రెడ్డి

14-05-2026 03:05 AM

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డిఓగా రవీందర్ రెడ్డి బుధవారం బాధ్యతలను చేపట్టారు. గతంలో బాన్సువా ఆర్డీవో గా పనిచేసిన కిరణ్ మై సంగారెడ్డి అదనపు కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. బాన్స్ వాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.