17-02-2026 12:00:00 AM
చేవెళ్ళ, ఫిబ్రవరి 16(విజయక్రాంతి): చేవెళ్ళ మున్సిపాల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవర సమతా వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. వైస్ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ 13 సభ్యులు కాసుల రాములు గౌడ్ ఎన్నికయ్యరు. రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గెలుపొందిన వార్డు సభ్యులు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రిసైన్డ్ డింగ్ అధికారి బి. రంగా రావు మున్సిపాల్ కమిషనర్ వెంకటేశం అభ్యక్షతన చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సోమవారం సమయం 11: 30 గంటలకు 18 మంది వార్డు సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమయం 12 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ను ఎన్నికున్నారు. మరో అరగంట తర్వాత వైస్ చైర్పర్సన్ అభ్యర్తుల ఎన్నిక జరిగింది. అంతకు ముందు చేవెళ్ళ మున్సిపల్ చైర్మన్ గా 16వ వార్డు కౌసిలర్ దేవర సమత రెడ్డిని 15వ వార్డు కౌసిలర్ బండారి శైలజ రెడ్డి ప్రత్తిపాదించిగా 14వ వార్డు కౌసిలర్ మద్దెల శ్రీనివాస్ బలపరిచారు.
వైస్ చైర్మన్ గా 13వ వార్డు సభ్యులు కాసుల రాములు గౌడ్ ను 8వార్డు కౌసిలర్ ప్రత్తిపాదించిగా 11వార్డు కౌసిలర్ పైడ్ల మధుసూదన్ రెడ్డి బలపరిచారు. అయితే ఫిబ్రవరి 15న టీపీసీసీ సెక్రెటరీ జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 11 మంది అభ్యర్థులకు పార్టీ తరుపున విప్ జారీ చేశారు.
ఏక్‌ఆపిషియో సభ్యులు ఎంపీ, ఎంఎల్ సీ, ఎమ్మెల్యే చేవెళ్ల మున్సిపాలిటీలో ఒకరోజు ముందే కమిషనర్ వద్ద తమ ఓటు నమోదు చేయించుకోవలసి ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరుకూడా ఓటు నమోదు చేయించుకోలేరని ప్రిసైన్డింగ్ అధికారి చెప్పారు. ఎన్నికైన సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంత రామ్మొహన్ మాజీ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి, ఇంచార్జ్ భీమ్ భరత్ శుభాకాంక్షలు తెలిపారు. నలుగురి కో ఆఫ్షన్ సభ్యులు ఎన్నిక ఈ నెల 20న జరుగనుంది.