9 June, 2026 | 1:35 AM

కిషన్‌రెడ్డిని విమర్శించే హక్కు సీఎంకు లేదు

09-06-2026 12:38 AM

నిర్మల్ జూన్ 8 (విజయ క్రాంతి): కేంద్రమంత్రి కిషన్ రెడ్డిది విమర్శించే నైతికకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే బిజెపిని కిషన్ రెడ్డిని విమర్శించి తన పబ్బం కడుక్కుంటున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది రాష్ట్రం అభివృద్ధి చెందదని రాష్ట్ర అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కేంద్ర మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించుకోవాలన్నారు. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్. పార్టీ నాయకులు పాల్గొన్నారు.