పోంచర్ల ముత్యాలమ్మ జాతరకు నిధులు మంజూరు చేయాలి
హుజూర్ నగర్, జూన్ 8:తెలంగాణ రాష్ట్రంలోనే బోనాల పండుగ రెండో జాతరగా పేరు పొందిన హుజూర్ నగర్ ముత్యాలమ్మ జాతర కు నిధులు మంజూరు చేయాలని ముత్యాలమ్మ జాతర నిర్వహణ కమిటీ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. శనివారం హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముత్యాలమ్మ జాతర కమిటీ నిర్వాహకులు మర్యాద పూర్వకంగా కలిశారు
జిల్లాలోనే అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించే పోంచర్ల ముత్యాలమ్మ జాతరకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ ను కోరారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుండి ముత్యాలమ్మ గుడి అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోచర్ల ముత్యాలమ్మ జాతర కమిటీ నిర్వాహకులు కంచర్ల అరవింద్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ తండు ప్రసాద్,వేముల నర్సయ్య, రామిశెట్టి రాము, తదితరులు పాల్గొన్నారు.






