25 June, 2026 | 3:02 AM

మెట్రో సమగ్ర, ఆర్థిక నివేదికను ప్రజల ముందుంచాలి

25-06-2026 01:46 AM
  1. ఎంఎంటీఎస్‌కు రూ.500 కోట్లు కేటాయించాలి
  2. సిటిజన్స్ ఫర్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్  డిమాండ్

ముషీరాబాద్, జూన్ 24(విజయక్రాంతి): మెట్రో ట్రైన్ మొదటి దశపై సరైన అధ్యయ నం, ఆడిట్ ప్రకటించకుండా ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకోకుండా రెండో ద శపై ప్రభుత్వం ప్రకటన చేయడం ప్రజాస్వా మ్య విరుద్ధమని సిటిజన్స్ ఫర్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రతినిధి దొంతి నర్సింహ్మారెడ్డి, అర్బస్ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధి ఎం. శ్రీనివాన్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ప్ర తినిధి ఎం. శ్రీనివాస్ రావు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికైన ఆడిట్ చే యించి, ఒక సమగ్ర ఆర్థిక నివేదికను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

ఐఆర్‌ఎఫ్ సి రీఫైనాన్సింగ్ ఒప్పందం పూర్తి షరుతులను, నిబంధనలను, వ్యయాన్ని ఎవరు భరిస్తారనే దాంతో సహా వెల్లడించాలని వారు కోరారు. కేంద్రం అమోదానికి ముందు పేజ్-2 మార్గాలలో ప్రయాణికుల రద్దీ(డిమాండ్ అధ్యయనాలు), ప్రయాణికుల సంఖ్య అంచనాలు, సాధ్యాసాధ్యాల మదింపులను ప్రజల ముందుంచాలని, ప్రతిపాదిత 7, రెండవ దశ కారిడార్ల వెంబడి ఉన్న నివాసితులతో అధికారిక ప్రజా సంప్రదింపులను ప్రారంభించాలని వారు డిమాం డ్ చేశారు.

ప్రస్తుతం ఏమాత్రం అలస్యం చేయకుండా హైదరాబాద్ మెట్రోలో రోజువారి ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, వి ద్యార్థులు, వయోవృద్దుల కోసం ఆదాయ ఆధారిత ప్రయాణ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. వాణి జ్య భూ అభివృద్ధి ఆదాయంతో సహా, పి పిపి కన్సెషనరీతో ఉన్న పూర్తి ఆధాయ పం పిణి ఒప్పందాన్ని వెల్లడించాలని కోరారు. ప్రస్తుతం మెట్రోలో కేవలం నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు మాత్రమే ప్ర యాణిస్తున్నారని, ఈ మెట్రో ప్రయాణం సా మాన్య ప్రజలకు, పేదలకు ఎంత మాత్రం అనుకూలంగా లేదని ఆరోపించారు. ప్రభు త్వం సామాన్య, పేద ప్రజలకు అనుకూలంగా ఉన్న ఎంఎంటిఎస్ ను పట్టించుకో వడం లేదని, అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎం ఎంటిఎస్ కు రూ.500 కోట్లు కేటాయించి, ఎంఎంటిఎస్ రైళ్ళను పెంచి పూర్తిగా అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.