19 March, 2026 | 3:19 AM

పూర్తయినరుద్ర సహిత మహా చండీ యాగం

19-03-2026 12:00 AM

కొత్తపల్లి, మార్చి 18 (విజయ క్రాంతి): నగరంలోని 4వ డివిజన్ దుర్షేడ్ శ్రీ మరకత లింగ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో రెండు రోజులుగా శ్రీ విశ్వంభరీ పీఠం భాగ్యనగరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  రుద్ర సహిత మహా నవ చండీ యాగం ముగిసింది. బుధవారం శ్రీమ హాగణాధిపతి పూజ తో ప్రారంభించి.. ఆవాహిత మంటప పూజలు, శ్రీ రుద్ర సహిత మహా నవచండీ సప్తశతి యాగం, సువాసిని పూజ, కుమారీ పూజలు,

మహా పూర్ణాహుతితో చండీ యాగం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఋత్విక్ సన్మానము, తీర్థ ప్రసాద వితరణ, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఛైర్మన్ నందాల తిరుపతి, 4వ డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్, మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, రామచంద్రం,  అర్చకులు దేవరాజు ప్రశాంత్ శర్మ, దేవరాజు ప్రవీణ్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.