16 July, 2026 | 12:46 AM

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

16-07-2026 12:45 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, జూలై 15 (విజయక్రాంతి): ఆర్యవైశ్యుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహాసభ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు సమాజ అభివృద్ధిలో, వ్యాపార రంగంలో, సేవా కార్యక్రమాల్లో విశిష్ట పాత్ర పోషిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య సమాజాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తోందని, వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.