15 April, 2026 | 7:25 AM

గాలిపటాలు, మాంజా విక్రయ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

29-12-2025 01:25 AM

ఇల్లందు టౌన్, డిసెంబర్ 28, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  బి.రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ శ్రీ ఎన్. చంద్రబాను సూచనలతో ఇల్లందు సీఐ టి.సురేష్ పోలీసు సి బ్బందితో కలిసి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదివారం ఇల్లందు పట్టణం లో గాలిపటాలు మాంజా విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా (సింథటిక్ / నై లాన్ దారం) విక్రయించడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.

నిబంధన లు అతిక్రమించి నిషేధిత మాంజా విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయడమే కా కుండా సంబంధిత దుకాణాల లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశా రు. గ్లాస్ కోటెడ్ చైనా మాంజా వలన పక్షు లు, పశువులు తీవ్రంగా గాయపడడమే కా కుండా, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురై ప్రాణాపాయం కలిగే అవకాశముందని తెలిపారు.ప్రజలు ప ర్యావరణానికి, జీవజాలానికి హాని కలగని సాధారణ పత్తి దారాన్ని మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఎక్కడైనా నిషేధిత మాంజా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఎస్త్స్ర హసీనా, ఎస్త్స్ర నర్సిరెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.