calender_icon.png 6 November, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలి

06-11-2025 12:15:45 AM

* సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, నవంబర్ 5 :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. షేక్పేట్ డివిజన్ ఇన్చార్జిగా మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల బతుకులకు భరోసానిచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అయితే అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి, నెరవేర్చలేని వాగ్దానాలు చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. మన బతుకులకు భరోసానిచ్చిన కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.