calender_icon.png 6 November, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు..!

06-11-2025 08:21:08 AM

  1. మండల కేంద్రంలో డ్రైనేజీ కాలువ పై మెట్ల నిర్మాణం..
  2. రోడ్డు నాక్రమించుకొని వ్యాపారాలు ఇసుక నిల్వలు.
  3. చూసి చూడనట్లు అధికారుల తీరు..
  4. శాశ్వత కట్టడాలు చేపడుతున్నా పట్టించుకోని అధికారులు 

బెజ్జంకి: అధికారుల  కనుసనల్లోనే అక్రమ నిర్మాణాలు(Illegal constructions) జరుగుతున్నాయని మండల కేంద్రం లోని ప్రజలు విమర్శిస్తున్నారు. డ్రైనేజీపై కాల్వపై నిర్మాణాలు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అధికారులు అక్రమ నిర్మాణాల ముందు నుండే వెళ్తున్న చూసి చూడనట్టు వ్యవహరించే తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. అధికారుల కనుసనల్లోనే అక్రమ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా అధికారులు నిజాయితీతో  అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరుతున్నారు.  మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డును ఆక్రమించుకొని ఇసుక నిల్వలు  పండ్ల కూరగాయల ఇతర విక్రయాలు కొనసాగిస్తున్నారు. 

రోడ్డుపై విక్రయాలు... అద్దె యజమానులకు 

మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారులు చెల్లించడం  పండ్లు కూరగాయలు తినుబండారలు విక్రయించుకుంటూ అద్దె మాత్రం ఇంటి యజమానులకు చెల్లించడం ఆశ్చర్యమేస్తుంది.  వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న  అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మామూళ్లతో   రోడ్లపై విక్రయాలను అధికారులు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.