calender_icon.png 6 November, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్‌షాక్‌తో యువకుడి మృతి

06-11-2025 12:17:12 AM

మాచాపుర్ గ్రామంలోని పౌల్ట్రీఫామ్‌లో చోటు చేసుకున్న ఘటన

సిద్దిపేట రూరల్ నవంబర్:5 పౌల్ట్రీ ఫామ్ లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన రూరల్ మండల పరిధిలోని మాచాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. రూరల్ ఎస్త్స్ర రాజేష్ తెలిపిన వి వరాల ప్రకారం దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన జంగిటి రాజు(33) పది రోజుల క్రితం సీతారాం పల్లి గ్రామానికి చెందిన పడిగె నరసయ్య కు చెందిన పౌల్ట్రీ ఫామ్ ను లీజుకు తీసుకున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి కోడి పిల్లలను ఫామ్ లో దింపి, తిరిగి బుధవారం ఉదయం ఆ కోడి పిల్లలకు దానతో పాటు, నీళ్లు పెట్టడానికి పౌల్ట్రీ వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికి రాకపోవడం తో అతని భార్య సౌందర్య ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా, పౌల్ట్రీ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద రాజు పడిపోయి ఉండడాన్ని సౌందర్య గమనించి, అతడిని లాగేందుకు ప్రయత్నించగా ఆమెకు సైతం కరెంట్ షాక్ కొట్టింది. గమనించిన స్థానికులు రాజు మృతదేహాన్ని పక్కకు లాగారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుఎస్‌ఐతెలిపారు.