calender_icon.png 21 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ను బ్రిటీష్ అధికారే స్థాపించాడు!

20-01-2026 12:00:00 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): బీజేపీని బ్రిటీష్ జనతా పార్టీ అని అంటున్నారని, కానీ, కాంగ్రెస్‌ను ఒక బ్రిటీష్ అధికారి స్థాపించాడనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఐఎన్‌సీ అంటే ఇప్పుడు ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’గా మారిందని విమర్శించారు.

నరేగా(ఉపాధి హామీ పథకం) పేరు గురించి కాంగ్రెస్ బాధపడుతోందని, కానీ గాంధీజీ ఏం కోరుకున్నా రో తమకు అది ముఖ్యమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీ అన్నారని, కాంగ్రెస్‌ను తిరస్కరిస్తూ ప్రజలు గాంధీ ఆశయాన్ని నెరవేర్చుతున్నారన్నారు. స్కిల్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సు పెట్టాలని, అందులో మొదటి విద్యార్థి సీఎం రేవంత్ రెడ్డియే కావాలని ఆయన ఎద్దేవా చేశారు.