calender_icon.png 20 January, 2026 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది

20-01-2026 12:00:00 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, జనవరి19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పె ద్దపీట వేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఇందిరా మ హిళా శక్తి సంబరాలలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 1,03 ,67,848 /- రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దపల్లి మున్సిపాలిటి కి సంబంధించి 202 3-24, 2024-25 సంవత్సరానికి విడుదలైన వడ్డిలేని ఋణాలు అలాగే 490 సంఘాలకు గాను అమౌంట్ రూ. 1,03, 67,848. 00 రూపాయలు సంఘాల అకౌంట్లోకి విడుదల కావడం జరిగిందని, అలాగే పెద్దపల్లి మున్సిపాలిటి కి సంబంధించి 2024 -25, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లింకేజి లోన్స్: 315 సంఘా లకు గాను అమౌంట్ 49.21 (నలబై తొ మ్మిది కోట్ల ఇరవై ఒక లక్ష్య రూపాయలు) ఇప్పించారని, పెద్దపల్లి మున్సిపాలిటి కి సం బంధించి ప్రీనిధి లోన్స్ 150 సంఘాలకు అమౌంట్: 9.52.34 (తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల ముపై నాలుగు వేల రూపాయలు) అందించారని, అలాగే 2024-25, 2025-26 సంబంధించి 36 కొత్త మహళా సంఘాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రమాద భీమా మరియు లోన్ భీమా కింద మొత్తం 34,65,950-00 (ము పై నాలుగు లక్షల అరవైఐదు వేల తొమ్మిది. వందల యాభై రూపాయలు అందించారని, ఇందిరా మహిళా శక్తి పథకం పై మహిళలకు ఇండివిసువల్ మరియు గ్రూప్ యూనిట్ల క్రింద కేటరింగ్ సర్వీసెస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, డైరీ ప్రాజెకట్స్, ఫ్యాన్సీ స్టోర్, సూపర్ మార్కెట్, సారీ సెంటర్స్, మొబైల్ క్యాంటిన్ మొదలగు వాటిలో ఉపాధి అవకాశం కల్పిస్తూ (124) సంఘాల సభ్యులకు గాను రూ.409.69( నాలుగు కోట్ల తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేలు రూపాయలు) ఋణాలు బ్యాంకు లింకేజి, ద్వారా లోన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వంలో గ్రామీణ, పట్టణ ప్రాంతంల్లో ఉన్న మహిళా సంఘాలకు సంబందించి దాదాపు రూ. 3,100/- కోట్ల రూపాయలు 2018-23 సంవత్సరం మధ్యలో గత ప్రభుత్వం జీరో, పావుల వడ్డీ డబ్బులు మహిళా సంఘాల ఇవ్వలేదని, మహిళా సంఘాలు నిర్వీర్యం అవ్వడం జరిగిందని, 2014-18 సంవత్సరంలో అధికారంలో ప్రభుత్వం మహిళా రుణాలు ఇవ్వకపోతే ఆనాడు రాహుల్ గాంధీ శంషాబాద్ లో మహిళా సంఘాలతో కలిసి మీటింగ్ పెట్టి నీరసం వ్యక్తం చేస్తే 2018 ఎన్నికల ముందు రుణాలు ఇవ్వడం జరిగిందని,  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ప్రభుత్వం ద్వారా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహిళల పేర్ల మీదనే ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఇందిరమ్మ ఇండ్లు,ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ.,రైతు సోదరిమనులకు రూ 500/- రూపాయల బోనస్, రైతు రుణ మాఫీ, రేషన్ కార్డులతో పాటు దేశంలో సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమే అన్నారు.

రాష్ట్రంలో ఉన్న మున్సిపలల్లో జీరో వడ్డీ డబ్బులు ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని, పెద్దపల్లి 490 సంఘాలకు సుల్తానాబాద్ మున్సిపల్ ల్లో రూ. 58,00,000/- లక్షలు పెద్దపల్లి రూ. 1 కోటి 3 లక్షలు మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే దాదాపు రూ. 1,61,00,000/- లక్షల రూపాయలను ప్రభుత్వం అందించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వారికి సమన్యాయం చేసేవిధంగా ముందుకు వెళ్తున్నా మన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ అధికారులు, నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.