29 August, 2026 | 4:15 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

29-08-2026 03:42 PM

దేవరుప్పుల, ఆగస్టు 29 (విజయ క్రాంతి): అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడం కోసం కాంగ్రెస్ ప్రజా పాలన  ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సింగరాజుపల్లి సర్పంచ్ కొండ ఊర్మిళ మల్లారెడ్డి అన్నారు.శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.

కార్యక్రమంలో  ఉపసర్పంచ్ జోగు అనిల్, వార్డు సభ్యులు తాళ్లపల్లి వేణు,మేడ రాజు, మేకపోతుల నరసింహ,కొండ అఖిల్ రెడ్డి, పాలడుగు నవనీత ప్రవీణ్, కొంగరి జ్యోతి రాములు, నల్ల యాదగిరి, మడికొండ యాదగిరి, జాటోత్ చంద్రయ్య, తాళ్ల పెళ్లి ఐలయ్య, మడిపల్లి యాదగిరి, కత్తుల సంపత్ రెడ్డి, చింతల శ్రీను, జటంగి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.