3 July, 2026 | 8:09 PM

ఆలయాలు నిర్మించిన ఘనత బీఆర్‌ఎస్‌దే

03-05-2025 12:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, మే 2 (విజయ క్రాంతి): ఆలయాల నిర్మాణాలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసి ప్రభు త్వ నిధులతో ఆలయాలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మాజీ మంత్రి రామన్న పేర్కొన్నారు.

జైనథ్ మండలం కరంజిలో నూతన ఆలయంలో నంద మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం రామన్న మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు నిర్మించనన్ని వివిధ ఆలయాల నిర్మాణం కోసం బీఆర్‌ఎస్ ప్రభు త్వ నిధులు కేటాయించిందని గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతల ప్రాధా న్యత ఎంతో విలువైందని, అంటు వ్యాధులు దరిచేరకుండా  గ్రామ దేవతలు కాపాడతా యని దృఢమైన నమ్మకంతో పూజించడం జరుగుతుందని తెలిపారు. నాయకులు మారిశెట్టి గోవర్ధన్, మహేందర్ రెడ్డి, బిక్కి రవీందర్, గంగన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.