శ్మశాన వాటిక, బతుకమ్మ ఘాట్ అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్సే
బీఆర్‌ఎస్ నేత ఉప్పు జస్వంత్
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): ప్రగతినగర్‌లోని ప్రధాన సమస్యలై న స్మశాన వాటిక, బతుకమ్మ ఘాట్ అభివృద్ధికి బీఆర్‌ఎస్ మాత్రమే కృషి చేసిందని ఆ పార్టీ నాయకుడు ఉప్పు జస్వంత్ అన్నారు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్ ను, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను కలవడం జరిగిందని వివరించారు. ప్రగతి నగర్‌లో సుమారుగా 1.5 లక్షల జనా భా కలిగి ఉన్నదని వారికి స్మశాన వాటిక స్థలం లేకపోవడం దారుణం అన్నారు.
ప్రగ తి నగర్‌లో ఆక్రమణలకు గురవుతున్న పార్కు స్థలాలను తిరిగి కార్పొరేషన్ అధికారులు వాపస్ తీసుకొని ప్రజల ఉపయోగా లు వాటిని వినియోగించాలని కోరారు. ప్రగతి నగర్‌లో స్మశాన వాటిక కొరకు స్థలాన్ని జిల్లా కలెక్టర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంయుక్తంగా నిర్దిష్ట స్థలాన్ని చూపించాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ఎన్‌ఎంసి అధికారులు ప్రగతి నగర్ కు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.






