24-09-2025 01:35:35 AM
తెలంగాణ లఘు ఉద్యోగ్ భారతి
ఖైరతాబాద్; సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి) : కేంద్రప్రభుత్వం 376 వస్తు సేవలపై భారీగా పన్ను తగ్గిస్తూ సంస్కరణలు తీసుకురావడం చరిత్రాత్మకమైన నిర్ణయమని లఘు ఉద్యోగ్ భారతి తెలంగాణ అధ్యక్షులు వసంతం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.నరేంద్రనాథ్ దత్ లు తెలిపారు . మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
సగటు సామాన్య పౌరుడిపై పన్ను భారాన్ని తగ్గించి వారి జీవనాన్ని సులభతరం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణల వల్ల చిన్న పరిశ్రమలకు, వినియోగదారులకు అతి పెద్ద ఊరట కలిగిందని తెలిపారు.
రోజువారీగా వాడే నెయ్యి, వెన్న, పనీర్, ఔషధాలు, లైఫ్ సేవిం గ్, డ్రగ్స్, టీవీలు ఎసిలు వాషింగ్ మెషిన్లు, క్యాన్సర్ వంటి 33 రకాల ఔషదాలు, ఇంటి నిర్మాణ సామగ్రి, సిమెంట్, ఆటోమొబైల్స్ వంటి వస్తువలపై గణనీయంగా పన్ను తగ్గించారన్నారు.
వ్యవసాయ పరికరాలపై 12 శాతం నుంచి 5శాతం వరకు పన్ను పడిపోయిందన్నారు. చదువు మెటీరియల్, నోటు బుక్‌లపై జిఎస్టి లేకుండా చేశారన్నారు. అనేక వస్తువలపై ధరల తగ్గటంతో వినియోగం, మార్కెట్లో వస్తు సేవల డిమాండ్ వస్తుందన్నారు. తద్వారా పారిశ్రామిక ఉత్పత్తి కూడా పెరుగుతుందని తెలిపారు.