24 August, 2026 | 10:43 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి   •   ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •  

కరెంటును కట్ చేసిన కాకి

19-06-2025 12:24 AM

అంధకారంలో సింగారం గ్రామం 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18, (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కాకి కరెంటు కట్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని సమితి సింగారం ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ఏరియా లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కరెంటు సరఫరాకు ఎక్కడ అంతరాయం ఏర్పడిందో ఆరా తీశారు.

చివరకు కరెంటు స్తంభం దగ్గర అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఓ కాకి కరెంటు స్తంభంపై గూడు పెట్టేందుకు ఆ వైర్ మొక్క జారే స్తంభం పైన ఉన్న ఫేస్ 1 ఫేస్, 2 పై పడటంతో మంటలు చెలరేగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో గంటన్నర పాటు సింగారం ప్రాంతంలో అంధకారం నెలకొంది. మరమ్మత్తుల అనంతరం విద్యుత్ వెలుగులు విరజమ్మాయి.