calender_icon.png 6 December, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్ష పదవి గొప్ప అవకాశం

06-12-2025 12:57:54 AM

-రవాణా శాఖ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

-కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యం

కరీంనగర్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం ఒక గొప్ప అవకాశం అని, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లా డుతూ.. ‘ఉస్మానియా యూనివర్సిటీ ఉద్య మ నాయకుని స్థాయి నుండి యూత్ కాంగ్రె స్, చొప్పదండి అసెం బ్లీ నియోజకవర్గ అధ్యక్షునిగా, నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన మేడిపల్లి సత్యం, నాతోపాటు ఎన్‌ఎస్‌యుఐ నుండి పనిచేసిన సంగీతం శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్‌లు పదవులు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.

గత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనుభవాలను సలహాలను  తీసుకొని ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తే తప్పకుండా మేమంతా మీ వెంట ఉండి పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాడినట్లుగా నేడు ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సమస్యలు పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు. 

ఉత్తర తెలంగాణకు గుండెకాయ కరీంనగర్: మేడిపల్లి 

డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. జిల్లా ఉత్తర తెలంగాణకు గుండెకా య అయినటువంటి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తు న్నానని తెలిపారు. ఒక సాధారణ కార్యకర్తగా ఉస్మానియా వర్సిటీలో ఉద్యమ నేతగా పనిచేశానని తెలిపారు. దాదాపు 40 వేల మెజా రిటీతో నన్ను చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజాపాలనలో ప్రజలు నిచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్  చేసిందన్నారు. జిల్లాకు చెందిన పెద్ద నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రతి కార్యకర్తకు న్యాయం చేసి తీరుతామని హామీ ఇచ్చారు.

అంతకుముందు కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొ రేటర్ నడిపల్లి అశోక్ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.