మల్లెపల్లి కెనాల్ కు పడ్డ గండి పూడ్చివేత.. రైతులకు అందుతున్న సాగునీరు
01-08-2025 08:45 PM
మంత్రి ఆదేశాలతో పూడ్చిన గండి.. మంత్రికి రైతుల కృతజ్ఞతలు..
మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని మల్లెపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కు గండి పడి రైతులకు సాగునీరు అందకపోవడంతో రైతులు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి హుటాహుటిన గండిని పూడ్చారు. దీంతో మంథని మండలంలోని బోయినిపేట వరకు రైతులకు సాగునీరు అందుతుంది. రైతులు తెలపడంతోనే వెంటనే స్పందించిన మంత్రికి రైతుల కృతజ్ఞతలు తెలిపారు.






