01-08-2025 08:48:51 PM
డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్..
మందమర్రి (విజయక్రాంతి): వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్(District Medical Health Officer Dr. Harish Raj) కోరారు. పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాగే ప్రభావిత ప్రాంతాలలో, మున్సిపల్ వార్డులలో వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. వైద్యాధి కారులు మున్సిపల్ అధికారు లతో సమన్వయంగా కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టా లన్నారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అర్బన్ ఆరోగ్య కేంద్రం పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు, వంటగది, వంట మనుషులను, వంట సామాగ్రి, వంట గదులను, పర్యవేక్షించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. గర్భవతుల ఈటీడీలు నమోదు చేసి వారి వివరాలను సమీక్షించాలని, అసంక్రమణ వ్యాధులు నిర్ధారణ కోసం 30 సంవత్సరములు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస, డాక్టర్ జాన్వి సురేఖ, మోహన్, బుక్క వెంకటేశ్వర్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట సాయి లు పాల్గొన్నారు.