04-07-2025 12:00:00 AM
-స్పష్టం చేసిన భారత్
న్యూఢిల్లీ, జూలై 3: 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం ప్రస్తుత బౌద్ధమత గురువు దలైలామా చేతుల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు.
ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనో లేదా ఆ సంస్థ మాత్రమే చేస్తుంది. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఆనుచరులందరికీ ఎంతో ముఖ్యమైనది’ అని రిజిజు పేర్కొన్నారు. దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల సుగ్లాగ్‌ఖాంగ్ ఆలయంలో ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ తరఫున రిజిజు, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు లల్లన్ సింగ్‌లు హాజరుకానున్నారు.