23 వేల పాఠశాలల మూసివేతను వెంటనే ఉపసంహరించుకోవాలి
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట పీడీఎస్‌యూ ధర్నా
ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో 23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల, తదితర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్‌కి విద్యారంగ సమస్యలతో కూడిన వినతిపత్రం అంద జేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు పి. మహేష్, పొడపంగి నాగరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి బెంగళూరులో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 23 వేల పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన లక్షలాది విద్యార్థును విద్యకు దూరం చేయడమేనని, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి వేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే 23 వేల పాఠశాలల మూసివేతను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డి.శ్రీకాంత్, దీపాలక్ష్మి. రాష్ట్ర సహాయ కార్యదర్శులు గౌతమ్ కుమార్, మస్తాన్, అజయ్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు శ్యామ్, ఝాన్సీ, సింహాద్రి, మహేష్, పవన్, మహేష్, శ్రీకాంత్, భరత్, షబ్బీర్ పాల్గొన్నారు.






