స్క్రాప్ దుకాణదారులు పరిశుభ్రతకు సహకరించాలి
మున్సిపల్ చైర్ పర్సన్ యూనుస్
జహీరాబాద్, జూన్ 15: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్క్రాప్ దుకాణాల యజమానులు పరిశుభ్రతపై దృష్టి సారించాలని జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మొహమ్మద్ యూనుస్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ తో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై పలు సూచనలు సలహాలు చేశారు. స్క్రాప్ యజమానులు షాపుల ముందు చెత్త పదార్థాలను వదిలివేయరాదని తెలిపారు. ప్రతి స్క్రాప్ దుకాణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎవరైనా దొంగలించబడిన వస్తువులను కొనుగోలు చేసినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని తెలిపారు. స్క్రాప్ దుకాణాల ముందు ప్రజా రహదారులను డ్రైనేజీలను రోడ్లను ఆక్రమించరాదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి షాప్ యజమాని రెడ్ లైసెన్సులు తీసుకోవాలని దానిని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువులను ఇతర వ్యర్థ పదార్థాలను రోడ్లపై వేయరాదని, ప్రభుత్వ భూములను ఆక్రమించరాదన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ ఎస్త్స్ర లవ కుమార్, కమిషనర్ జి.ప్రభాకర్, స్క్రాప్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు.






