17 April, 2026 | 2:31 AM

ఏఆర్ కానిస్టేబుల్ సైదులు మృతి పోలీస్ శాఖకు తీరని లోటు

17-04-2026 12:39 AM

హుజూర్ నగర్, ఏప్రిల్ 16:ఏఆర్ కానిస్టేబుల్ సైదులు మృతి పోలీస్ శాఖకు తీరని లోటని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గెల్లి రవి,మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు.సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ సైదులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీస్ శాఖలో వారు చేసిన సేవలను పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో దొంగరి వెంకటేశ్వర్లు,గొట్టే రామయ్య, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామచంద్రగౌడ్, కౌన్సిలర్స్ వల్లపుదాసు కృష్ణ, బెల్లంకొండ శ్రీనివాస్,అట్లూరి హరిబాబు, అమర్, జక్కుల వీరయ్య, యడవెల్లి వీరబాబు, దొంతగాని జగన్, అనీఫ్, తదితరులు పాల్గొన్నారు.