29 July, 2026 | 7:59 PM

Breaking News

బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •   పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం   •   శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణిమ వేడుకలు   •   పలుగ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు   •  

ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి

01-06-2026 12:50 AM
  1. గత ప్రభుత్వం సర్పంచులను ఇబ్బంది పెట్టింది
  2. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నిధులు ఇవ్వాలి
  3. వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్     

ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కాచిగూడ అభినందన్ హోటల్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్గారీ రంజిత్ కుమార్ గౌడ్, బి. భూపాల్ రెడ్డి, బి. అమర్ నాథ్ రెడ్డి, నడికుడి అశోక్‌లతో కలిసి ఏర్పాటుచేసిన మీడి యా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభు త్వం సర్పంచులను ఇబ్బంది పెట్టిన, ప్రభుత్వంపై పోరాటం చేశామని గుర్తు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వానికి గ్రామాలకు నిధులను విడుదల చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కక్ష సాధింపులకు పోకుండా సమన్వయంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మల్గారి రంజిత్ కుమార్ తెలంగా ణ రాష్ట్ర సర్పంచ్ ల సంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మల్గారి రంజిత్ కుమార్ నియమితు లయ్యారు. ఈ మేరకు  కాచిగూడలో జరిగిన సమావేశంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ నియామక పత్రాన్ని రంజిత్ కుమార్ కు అందజేశారు.

ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ  గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని అన్నారు. సర్పంచులకు ఎలాంటి సమస్య వచ్చిన తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రధానంగా నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన  యన్నన్ గుండ్ల గ్రామపంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సర్పంచుల సంఘం అప్పగించిన బాధ్యతను మనసా వాచా కర్మ చతుర్థితో అంకితభావంతో క్రమశిక్షణతో సమయం ఇచ్చి పని చేస్తానని వెల్లడించారు. తనకు సహకరించిన సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.