27 July, 2026 | 12:55 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం

10-02-2026 12:09 AM

ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి 

అలంపూర్, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అలంపూర్ మున్సిపాలిటీలో బిజెపి పార్టీ అభ్యర్థుల తరఫున ఆంధ్రప్రదేశ్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అనేక ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమన్నారు.

గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ హయంలో అలంపూర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.అదే పంథాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు.అన్ని పార్టీలకు అవకాశం కల్పించారని ఒక్కసారి బిజెపి అభ్యర్థులకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు.బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే పార్థసారథి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గద్వాల బిజెపి ఇన్చార్జి మర్రి బాపు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.