calender_icon.png 10 February, 2026 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోల్ చిట్టీల పంపిణీ

10-02-2026 12:09:29 AM

కేసముద్రం, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మున్సిపల్ సిబ్బంది ఓటర్లకు పోల్ చిట్టీలను అం దజేస్తున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లోని ఓటర్లకు పోల్ చి ట్టీలను సిబ్బంది ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నారు. పోల్ చిట్టీల్లో ఓటర్ క్రమ సం ఖ్య, ఓటర్ పేరు, పోలింగ్ కేంద్రం వివరాలు పొందుపర్చారు.

దీనితో ఓటర్ల కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగిం చుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదని, ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కచ్చితంగా ఓటేయడానికి వెంట తీసుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.