4 July, 2026 | 1:42 AM

విద్యార్థుల అభివృద్ధే మనదేశ అభివృద్ధి

04-07-2026 12:49 AM

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్

ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): విద్యార్థుల అభివృద్దే మన దేశ అధివృద్ధి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యాసభ ఎంపీ  డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో శుక్రవారం ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ డా. కె.లక్ష్మణ్ పుట్టిన రోజు సందర్భంగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పెద విద్యార్థిని, విద్యార్థులకు ఎంపీ డా. లక్ష్మణ్ స్కూల్ బ్యాగ్ లను అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ మనుగడ, దేశ అభివృద్ధి నేటి విద్యార్థుల చేతుల్లో వుందన్నారు.  విద్యారంగంలో వారికి చేయూత నిచ్చే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ బచావ్... భేటీ పడావ్.. అన్న నినాదాన్ని అమలు పరచారని అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, రాజు, ఎం. ఉమేష్, కృష్ణ ప్రసాద్, మహమూద్, శ్రీనివాస్, ఆనంద్ రావు, శ్రీనివాస్ యాదవ్, సాయి కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సంపత్, సంతోష్, పూర్ణ దేవి, అనుష, డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.