calender_icon.png 4 June, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతిస్థిమితం లేని మహిళా అదృశ్యం

02-06-2025 10:40:52 PM

పెన్ పహాడ్: మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండల పరిధిలోని తంగేళ్లగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గోపిక్రిష్ణ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుక్కడపు భాగ్యమ్మ(46) గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేకుండా ఉండడంతో తన తమ్ముడు కీర్తి ఎలమంచయ్య ఇంటిదగ్గర చీదేళ్ల గ్రామంలో నివసిస్తూ తమ్ముని పోషణలో ఉన్నది. గత నెల 29న, మధ్యాహ్నం కొబ్బరి నూనె తెచ్చుకుంటానని చెప్పి కిరాణంషాప్కు వెళ్లినది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆమెకోసం ఆచూకీ కోసం పలు ప్రయత్నాలు చేసిన ఫలితం లేక పోవడంతో ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.