జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి
- ఎంపీ సురేష్ షెట్కర్
- అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
- ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి, జూన్ 24 (విజయక్రాంతి) : ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీ సుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంట్ స భ్యులు సురేష్ షెట్కర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎం పీ సురేష్ షెట్కర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు.
మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యాన్ని నివారించి త్వ రితగతిన పూర్తి చేయాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖ, జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనుల్లో ఆలస్యంపై అసంతృ ప్తి వ్యక్తం చేస్తూ, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించాల న్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను పా రదర్శకంగా, సమర్థవంతంగా వినియోగిస్తూ అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను కోరారు.
జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల సా గుపై అవగాహన కల్పించాలని సూచించా రు. ముత్తంగి నుంచి సంగారెడ్డి చౌరస్తా వర కు జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.






