21 April, 2026 | 2:01 AM

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం!

21-04-2026 12:21 AM

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పేదల స్వంత ఇంటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆందోల్‌జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు బస్వాపురం మల్లమ్మమల్లయ్య, విజయలక్ష్మిజగదీశ్వర్ ల  ఇందిరమ్మ ఇంటిని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల గృహావసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. 

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, ఎవరూ ఇల్లు లేకుండా ఉండకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఆందోల్ - జోగిపేటలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా నిర్మాణం పూర్తి  అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ మాధురి,మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి,  వైస్ చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్ రేఖప్రవీణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మహాత్మ బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త...

విశ్వగురు, మహాత్మ బసవేశ్వర 893 వ జయంతి సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట చౌరస్తాలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికుడు, కవి, రాజనీతిజ్ఞుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, లింగాయత్ సమాజం, సామాజికవేత్తలు పాల్గొన్నారు.