14 July, 2026 | 3:57 AM

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల కల సాకారం

14-07-2026 12:56 AM

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్ 

బీబీపేట్ ,జులై 13 (విజయ క్రాంతి): బిబిపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇల్లు ప్రొసిండింగ్ పత్రాన్ని  సర్పంచ్ హరీశ్ యాదవ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కలిసి లబ్ధిదారు ముదాం సరస్వతికి మంజూరు పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు గుడిసెలు, తాత్కాలిక నివాసాలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చాలనే లక్ష్యంతో ప్రజా పాలన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో  ఈ సామాజిక విప్లవ కార్యక్రమం రాష్ట ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు

సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు  ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు అర్హులైన కుటుంబానికి గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా  ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగు బాయి,వార్డ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రోడ్డ లావణ్య బాబు,గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రోడ్డ రాజు,  రాజిరెడ్డి, గంగారాములు, చింతకుంట రాజు రెడ్డి,బొంద శివ, సలీం, శ్రీనివాస్, శంకరయ్య, బాలయ్య,తదితరులు పాల్గొన్నారు