14 July, 2026 | 3:57 AM

దోమకొండలో పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి

14-07-2026 12:57 AM

దోమకొండ, జూలై 13 (విజయక్రాంతి): దోమకొండ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి పలువురి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. ఇటీవల కుటుంబాల్లో మరణాలు, అనారోగ్యం, ఇతర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సాహెబ్ గారి భరత్, మోహన్ రెడ్డి, కొండల్ రెడ్డి, రాజు, తిప్పపురం రవి, పొన్న లక్ష్మణ్, రాజిరెడ్డి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, బాధితులకు ధైర్యం చెప్పారు.

ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.