27 July, 2026 | 6:34 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

జలమండలిలో ఆమ్దానీ అనంతం!

20-05-2026 01:08 AM

బీరువా నిండా నోట్లు.. కోట్లు

కళ్లు చెదిరే నగలు.. కిలోలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వాటర్ బోర్డు

జీఎం అనంతలక్ష్మీ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

  1. ఇంట్లో 1.10 కోట్ల నగదు స్వాధీనం 
  2.   2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి 
  3. ఏకకాలంలో 8 చోట్ల సోదాలు 
  4.   100 కోట్ల పైన అక్రమాస్తుల గుర్తింపు 
  5. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల భూములు 
  6. హైదరాబాద్‌లో 6 నివాస స్థలాలు, 3 ఫ్లాట్లు

మేడ్చల్/ఉప్పల్, మే 19 (విజయక్రాంతి): ఆయన పేరు అనంతలక్ష్మీ కుమార్.. రెడ్‌హిల్స్ జలమండలి జీఎం.. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఆయన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల కన్నుపడిం ది. మల్లాపూర్‌లోని కుమార్ నివాసానికి మంగళవారం ఉదయం 6 గంట లకే వెళ్లారు. సోదాలు నిర్వహించారు. బీరువా తెరిచిచూస్తే నిర్ఘాంతపోవడం ఏసీబీ అధికారుల వంతైంది.

కట్టలుకట్టలుగా నోట్లు.. వెండి, బంగారు ఆభరణాలు కిలోల్లో.. ఆయన ఇంట్లో దొరికిన పత్రాల ప్రకారం ఎకరాల్లో భూములు, అనేక ఫ్లాట్‌లు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో రెడ్‌హిల్స్ జలమండలి జీఎం అనంతలక్ష్మీ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి నోట్ల కట్టలు, కిలోల బం గారం, వెండి ఆభరణాలు చూసి కళ్లు చెదిరాయి. ఎక్కడ వెతికినా ఏదో ఒక టి విలువైన వస్తువు బయటపడింది.

కుమార్ నివాసంతోపాటు రాష్ట్రంలోని 8 చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆ ధ్వర్యంలో ఏసీబీ అధికారులు మల్లాపూర్ లోని కుమార్ నివాసానికి ఉదయం 6 గంటలకే చేరుతున్నారు. ఇంట్లో నుంచి ఎవరిని బయటకు వెళ్ళనీయలేదు. నివాసంలో రూ. 1.10 కోట్ల నగదు కట్టలు లభించాయి. వాటి ని లెక్కించడం సాధ్యం కాదని, కౌంటింగ్ కోసం మిషన్లను తెచ్చారు. అలాగే 2.1 కిలో ల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులు గుర్తించారు. 

కారు, బైక్‌ను స్వాధీ నం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూ నిటీలో మూడు ఫ్లాట్లు, ఆరు ఇళ్ల స్థలాలు, ఓ ఇంటి పత్రాలు.. నిజామాబాద్‌లో మూ డు ఎకరాల వ్యవసాయ భూమి, సంగారెడ్డిలో ఐదెకరాల భూమి ఉన్నట్టు గుర్తించా రు. మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 5.88 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. కుమార్‌కు చెందిన లాకర్లు తెరిస్తే మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. కాగా అనంతలక్ష్మీ కుమార్ కూతురు వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా చేశారు. ఈ వివాహానికి భారీగా ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎలా సం పాదించారనే వివరాలు సేకరించనున్నారు. కుమార్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, విచారణ అనంతరం మరిన్ని ఆస్తులు గుర్తించనున్నట్లు తెలుస్తున్నది.