8 April, 2026 | 4:16 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాలి

02-12-2024 12:52 AM

పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): భవిష్యత్ తరాల మనుగడుకు ఇబ్బంది కలగకుండా భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ దిశగా ప్రభుత్వానికి సహకరిస్తూ విధిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలుష్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి ఏటా జాతీయ కాలుష్య నియంత్రణ దినాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది “స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి -సుస్థిరమైన జీవనం వైపు అడుగు” అనే నేపథ్యంతో కాలుష్య నియంత్రణ దినాన్ని టీజీపీసీబీ నిర్వహిస్తున్నదని తెలిపారు.

పెరుగుతున్న వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడం, పారిశ్రామిక విపత్తుల నియంత్రణ, పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు పర్యావరణ అనుకూల వస్తువులను వాడటంతోపాటు, మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాచరణకు తోడుగా ప్రజలు ఉద్యమిస్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.