20 July, 2026 | 6:54 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

గిరిజనుల విద్యాభివృద్ధి, అటవీ హక్కుల పరిరక్షణే ప్రధానం

20-07-2026 01:03 AM

ఎన్హెచ్‌ఆర్సీ అధికారి హేమంత్ కుమార్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 19 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, అటవీ హక్కుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్‌ఆర్సీ) ట్రైబల్ వెల్ఫేర్ మానిటరింగ్ అధికారి ఆర్. హేమంత్ కుమార్ అన్నారు.కాగజ్నగర్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన హేమంత్ కుమార్ విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, సాధారణ విజ్ఞానం, పోటీ పరీక్షల సన్నద్ధత, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. గిరిజన విద్యార్థులు విద్యనే ఆయుధంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను కూడా విద్యార్థులకు అందించాలని కోరారు.ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో గిరిజన అమరవీరులు కొమురం భీమ్, ఎడ్ల కొండూ విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం గ్రామస్తులతో సమావేశమైన ఆయన తాగునీరు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలుపై వారి సమస్యలను తెలుసుకున్నారు. మెంగుబాయి గూడా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ (అటవీ హక్కుల గుర్తింపు) అంశంపై గ్రామస్తులతో చర్చించి అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి చట్టబద్ధమైన అటవీ హక్కులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కేంద్రంలోని గిరిజన మోడల్ స్పోరట్స్ పాఠశాలను సందర్శించిన హేమంత్ కుమార్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించారు. తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను అధికారులు బాధ్యతాయుతంగా పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఉట్నూర్ ఏపీఓ వసంత్ రావు, డీటీడీఓ జాదవ్ అంబాజీ, ఏసీఏఎంఓ పూర్కా ఉద్ధవ్, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, ఏటీడీఓలు చిరంజీవి, భాస్కర్, ఎస్సీఆర్పీలు రాథోడ్ రవీందర్, కూడ్మేత అనంత్, జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు, పీడీ బండ మీనారెడ్డి, ఆసిఫాబాద్ ఎంఆర్‌ఓ, ఎస్డీసీ గంగాధర్, అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, స్థానిక సర్పంచ్ ఆత్రం కొండూ, మాజీ సర్పంచ్ కిష్టయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.