calender_icon.png 17 December, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదమ్ములను కలిపిన ఎన్నికలు

17-12-2025 01:19:07 AM

  1. వేర్వేరు చోట్ల ఉపాధ్యాయులుగా విధుల నిర్వహణ
  2. నేడు ఒకేచోట పోలింగ్ బాధ్యతలు నిర్వహించనున్న సోదరులు
  3. కుభీర్ మండల కేంద్రంలో అపూర్వ ఘటన
  4. అభినందించిన అధికారులు

కుభీర్, డిసెంబర్ 16(విజయక్రాంతి): ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏదోక చోట ప్రత్యేకత చాటుతూనే ఉంది. తుది విడుదల జరు గుతున్న ఎన్నికల వేళ అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. నలుగురు అన్మదమ్ములు ఒకే మండలంలో ఎన్నికల విధులు నిర్వహించడం విశేషం. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం కుభీర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసే కేంద్రం వద్ద ఈ నలుగురు అన్నదమ్ములు కలుసుకున్నారు.

వారు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతా ల్లో స్థిరపడగా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల డ్యూటీ పడింది. దీంతో వారందరూ ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ అన్నదమ్ములను పంచాయతీ ఎన్నికలవేళ ఒకేచోట కలిసి విధులు నిర్వహించడం ఎం తో సంతోషమని పేర్కొన్నారు. ఆ నలుగురు అన్నదమ్ములు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారందరూ ఒక్క చోట చేరి ఎన్నికల విధుల్లో భాగస్వాములవడం ఓ గొప్ప అనుభూతి.

నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన రాజులదేవి చంద్రమోహన్ -లక్ష్మీ దంపతుల కుమారులైన రమేష్ బాబు, సురేష్ బాబు, విజయ్ కుమార్, నరేష్ బాబులు పేదరికంలో మగ్గుతూ కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారే. కాగా నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఉద్యోగరీత్యా విధులు నిర్వహి స్తుంటారు. ఒకే చోట నలుగురు అన్నదమ్ములు కలుసుకోవడం చాలా అరుదు.

ఈ నలుగురు అన్నదమ్ములు విధి నిర్వహణలో భాగంగా ఒక్కచోట చేరడంతో మండల ప్రత్యేక అధికారి శంకర్ తో పాటు ఎంపీడీవో సాగర్ రెడ్డి, ఎన్నికల అధికారులు జిలకరి రాజేశ్వర్, తహసీల్దార్ శివరాజ్, ఆయా శాఖల అధికారులు ఆ సోదరులను వేదికపైకి పిలిచి అభినందించారు. ఈ సంద  ర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ఘట్టం అపురూపమైనదని అన్నారు.

ఎన్నికల ప్రక్రియలో నలుగురు అన్నదమ్ములు ఒకే చోట చేరి భాగస్వాములు అవ్వడం అరుదైన సందర్భంగా అభివర్ణించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏవో సారిక రెడ్డి, ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.