calender_icon.png 17 December, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరిచూపు మాడ్గుల వైపే..

17-12-2025 01:24:45 AM

  1. కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు కోసం వ్యూహాలు

పర్యవేక్షణ చేస్తున్న ఎమ్మెల్యే 

అంతుచిక్కని ఓటరు నాడి

ఓట్ల కోసం సర్పంచ్ అభ్యర్థుల పాట్లు

తాయిలాలకు ఎర...

మాడ్గుల, డిసెంబర్ 16: మూడో విడత స్థానిక పోరుకు సర్వం సిద్ధం కాగా... ఇప్పుడు అందరి దృష్టి  ప్రత్యేకంగా  రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రం  పైనే  ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా ది స్వంత గ్రామం మాడుగుల పంచాయతీ కావడంతో ఇక్కడి పంచాయతీ ఎన్నికల  ఫలితాల పై  కొంత ఉత్కంఠత నెలకొంది. మాడ్గుల పంచాయతీ సర్పంచు బీసీ మహిళకు రిజర్వ్  అయ్యింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు తరపునా మాజీ ఎంపిటిసి రజిత దేవయ్య గౌడ్, బీ ఆర్‌ఎస్, బిజెపి ఉమ్మడి పార్టీల మద్దతుతో జెల్ల అంజమ్మ యాదయ్య గౌడ్ లు ప్రస్తుతం బరిలో ఉన్నారు.

దీంతో  మాడుగుల పంచాయతీ లో కాంగ్రెస్ తరపున నిలబడిన అభ్యర్థిని  గెలిపించాలని ప్రత్యేక వివరణ చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేకంగా వ్యూ హా రచన చేయగా, సీఎం మామ మాజీ ఎంపీపీ సూదిని  రామిరెడ్డి అభ్యర్థి గెలుపు కోసం క్రియాశీలకంగా పావులు కదుపుతున్నారు. మాడుగుల మండల కేంద్రంలో  అన్ని సామాజిక వర్గాలను ఒప్పించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్,బిజెపి ఉమ్మడి అభ్యర్థి గా బలపరిచిన అంజమ్మ కోసం ప్రతిపక్ష పార్టీలు సైతం గెలుపు కోసం సర్వశక్తులు వడ్డుతుంది.

దీంతో మాడుగుల పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు అందరి  లో ఉత్కంఠత నెలకొంది.మాడుగుల మొత్తం 34 జీపీలు ఉండగా మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ఒక్క పంచాయతీ నర్సంపల్లి ఎన్నికలను నిలిపివేలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 30 పంచాయతీల్లో 105 మంది సర్పంచ్ లు, 662 వార్డు మెంబర్లు బరిలో  ఉన్నారు మండలంలో మొత్తం 44,678 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 22,780, మహిళలు 21,898 మంది ఉన్నారు. మొత్తం 270 పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. 

అంతుచిక్కని ఓటరు నాడి.....

స్థానిక పోరు లో  ఓటరు నాడి అంతుచిక్కక బరిలో నిలిచిన అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికి వెలువడిన మొదటి, రెండో విడత ఫలితాలను చూశాక... తమ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళనకు గురవుతున్నారు. బరిలో నిలిచిన అప్పటినుండి  పోలింగ్ వరకు తమ ప్రత్యర్థులకు దీటుగా ఓటర్లకు అంత మంచి చెడ్డ చూసినా కానీ... ఎన్నికల ఫలితాల్లో ఓటర్ ఇచ్చిన తీర్పుకు  అభ్యర్థుల మైండ్ బ్లాక్ అవుతుంది. పోలింగ్‌సరళి చూసి మరింత టెన్షన్ పడుతున్నారు.

మందు.... విందుకు జై......

మూడో విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో ప్రచా రం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్ కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా తాము గెలుపొందాలని ఓటర్లను మందు విందులతో మచ్చిక చేసుకునే పనిలో ప్రస్తుతం నిమగ్నం అయ్యారు.మద్యం, మటన్, చికెన్, పిండి వంటలతోపాటుఉ డబ్బులు పంపిణీ చేస్తున్నారు.

గెలుపు కోసం ఖర్చు కు వెనుకాడడం లేదు. ప్రలోభాల జోరు పెంచుతు న్నారు. పట్నం, వలస ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నా రు. గ్రామాల్లో ’ఓటుకు నోటు’ టీంలు రంగంలోకి దిగాయి. ఒక్కో ఓటరుకు రూ.5000 నుంచి రూ.10 వేల వరకు ఆయా పంచాయతీల్లో డిమాండ్ అనుసరించి ఓటర్లకు గంపగుత్తగా ప్యాకేజీలు ఇస్తున్నట్లు సమాచారం. ’సైలెంట్ క్యాం పెయిన్’ పేరుతో ఓట్ల యుద్ధం సాగిస్తున్నారు.

ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు.....

ఇక మద్యం పంపిణీకి ప్రత్యేక ప్రదేశాలను సిద్ధం చేసి ప్రచారం ప్రారంభించిన రోజు నుంచే పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం వరకు కొరత రాకుండా స్టాక్ సిద్ధం చేశారు. అనేక గ్రామాల్లో మందు బాటిళ్లు, పిండి, నూనె క్యాన్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ మొదలు పెట్టారు. మటన్ -చికెన్ షాపుల్లో కిలో చొప్పున ప్యాక్ చేయాలంటూ ఆర్డర్లు వేసి అడ్వాన్సు కూడా చెల్లించారనే ప్రచారం ఉంది.

మద్యం ముట్టని కుటుంబాలకు  ప్రత్యేకంగా గిఫ్టులు స్వీట్ బాక్స్లు  బహుమతులుగా అందజేస్తున్నారు.వలస ఓటర్లకు బస్సు చార్జీలు, పెట్రోల్ ఖర్చులు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు.ల్లో కిలో చొప్పున ప్యాక్ చేయాలంటూ ఆర్డర్లు వేసి అడ్వాన్సు కూడా చెల్లించారనే ప్రచారం ఉంది. వలస ఓటర్లకు బస్సు చార్జీలు, పెట్రోల్ ఖర్చులు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు.