28 May, 2026 | 1:56 AM

త్యాగమూర్తి.. రమాబాయి అంబేద్కర్

28-05-2026 12:00 AM
  1. ఆమె సేవలు త్యాగం సహనం సేవా భావానికి నిలువెత్తు నిదర్శనం
  2. జవహర్ నగర్ బిజెపి అధ్యక్షులు కలికోట కమలాకర్

జవహర్ నగర్, మే 27 (విజయక్రాంతి): త్యాగం సహనం సేవా భావానికి నిలువెత్తు నిదర్శనం త్యాగమూర్తి మాత రమాబాయి అంబేద్కర్ అని జవహర్ నగర్ బిజెపి అధ్యక్షులు కలికోట కమలాకర్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మరాఠీ బాబు ఆధ్వర్యంలో బుధవారం మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కలికోట కమలాకర్ తదితరులు హాజరై మాత రమాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి వందనం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత ప్రయాణంలో మాత రమాబాయి పాత్ర అత్యంత విశిష్టమైనది అన్నారు. భారతదేశానికి ఆమె చేసిన సేవ యావద్దేశం గుర్తుంచుకుంటుందని, అంబేద్కర్ విద్యాభ్యాసం ,సామాజిక పోరాటం, దేశ సేవలో ముందుకు సాగేందుకు రమాబాయి ఎన్నో కష్టాలు భరించి తన కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ ఆయనకు అండగా నిలిచారని కొనియాడారు.

త్యాగం సహనం సేవా భావానికి ప్రతిరూపమే మాత రమాబాయి అని ఆమె సమాజానికి ఆదర్శ మూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి చంద్రపురి కాలనీ అధ్యక్షులు కర్లపూడి జోగారావు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, డాక్టర్ యాదగిరి, ముచ్చర్ల యాదగిరి, దయాకర్, సాయి, క్రాంతి, రాజు, నరేష్ పాల్గొన్నారు.