20 May, 2026 | 2:15 AM

రైతన్న కన్నె ర్ర

20-05-2026 01:03 AM

గన్నీ సంచులు ఇవ్వరు.. లారీలు రావు! 

కొనుగోళ్లలో జాప్యంపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన

కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి, మహబూబాబాద్ జిల్లా వస్రాం తండాలో రైతుల ఆగ్రహజ్వాల

40 రోజులుగా నిరీక్షిస్తున్నామంటూ ఆవేదన 

అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మండిపాటు

కామారెడ్డి/మహబూబాబాద్/నిర్మల్/బోథ్, మే 19 (విజయక్రాంతి)/సిద్దిపేట రూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు కన్నెర్రజేశారు. ధాన్యానికి నిప్పుపెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కొనకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మంగళవారం పలుచోట్ల ఆందోళనలకు దిగారు. నిర్వాహకులు గన్నీ సంచులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

కొన్నిచోట్ల లారీలను సమకూర్చకపోవడంతో ధాన్యం తరలింపు ఆలస్యం అవు తున్నదని రైతులు అధికారుల తీరును తప్పుబట్టారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో రైతులు సోమవారం రాత్రి వరికుప్పలకు నిప్పుపెట్టి నిర సన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మకానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చి 40 రోజులు కావస్తున్నా కాంటా పెట్టడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎండలో నిరీక్షిస్తున్నా అధికారుల్లో చలనంలేదని, తమ గోడు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీవో సురేందర్, డీపీఎం సాయిలు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్ సంఘటన స్థలానికి వెళ్లగా రైతు లు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని వారు నిలదీశారు. హమాలీలు, లారీలు లేకపోవడం వల్ల ధాన్యం సేకరణ చేపట్టడంలో ఆలస్యం జరిగిందని అధికారులు రైతులకు తెలిపారు. సంయమనం పాటించాలని కోరారు. సమస్య త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు ఆందో ళన విరమించారు. 

లారీల కొరతతో రోడ్డెక్కిన రైతులు..

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో మక్కల కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. దాదాపు రెండున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తూకం వేసి ఉంచిన పంటను తరలించకపోవడంతో తాము రాత్రి పగలు కాపలా ఉండాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాక మార్కెట్లో తూకం వేసిన దాదాపు 3000 బస్తాలు అలాగే ఉండిపోయాయని దీంతో కొత్తగా పంటను తీసుకువచ్చే రైతులకు స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే దిగుబడి మాత్రం 25 క్వింటాల నుండి 30 క్వింటాళ్ల వరకు వచ్చిందని ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు నిలదీశారు. ఎస్సై పురుషోత్తం రైతులను సముదాయించారు. అయినా రైతులు కలెక్టర్ మాట్లా డాలని డిమాండ్ చేయడంతో విషయాన్ని స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. తహసిల్దార్ సుభాష్ చంద్ర తో పాటు ఎంపీడీవో ఎల్ రమేష్, మార్కెట్ కమిటీ సెక్రటరీ విట్టల్, సీఈవో బారే భూషణ్ రైతులతో మాట్లాడారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 

పుల్లూరు స్టేజ్ వద్ద ఆందోళన..

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటేక్షిోస్తాబాద్ ప్రధాన రహదారిపై పుల్లూరు స్టేజ్ వద్ద రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా వర్షాలు వస్తే ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని, రైతుల కష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రైతుల ధర్నాకు మద్దతుగా బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. 

నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లో..

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామ రైతులు ధాన్యం, మక్కలు కొంటలేరని గ్రామంలోని ఐకేపీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం నిర్మల్ జాతీయ రహదారిపై చించోలి క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. పంట కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, కూలీలు, గోనె సంచుల కొరత తీవ్రంగా ఉన్నదని వాపోయారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జిల్లా అధికారులకు సమస్యను వివరించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

గన్నీ సంచుల ఇస్తలేరని ధాన్యం బస్తాకు నిప్పు..

ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు రైతులకు గన్ని బస్తాలు ఇవ్వకుండా మాయం చేస్తున్నారని, రోజుల తరబడి తాము ధాన్యం కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నామని నిరసన వ్యక్తం చేస్తూ మహబూ బాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం వస్రాం తండాలో ధాన్యం బస్తాకు రైతులు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.

రెండు రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఐదువేల ఖాళీ గన్నీ సంచులు వచ్చాయని, నిర్వాహకులు కేవలం రైతులకు 300 సంచులను మాత్రమే ఇచ్చి, 4,700 గన్ని సంచు లను మాయం చేశారని రైతులు ఆరోపించారు. రోజుల తరబడి తాము ధాన్యం కొను గోలు కోసం కేంద్రంలో ఇబ్బందులు పడుతున్నామని, గన్ని సంచులను ఇవ్వకపోవ డంతో కాంటాలు పూర్తికావడంలేదని, ఇంకె న్ని రోజులు తాము కొనుగోలు కేంద్రంలో నిరీక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.